![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -833లో.....రాజ్ హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఒకతను తన భార్యకి అబార్షన్ చేయిస్తున్నాడని తెలిసి అతనితో గొడవపడతాడు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బయటకు తీసుకొని వెళ్తాడు. ఏంటి అన్నయ్య అందరితో గొడవ పెట్టుకుంటూ వెళ్తే ఎలా కనీసం వదినని అయిన బ్రతికించే ప్రయత్నం చెయ్ అని కళ్యాణ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో రుద్రాణి ఆలోచిస్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. మమ్మీ మనకి ఇదే కరెక్ట్ టైం.. రాజ్ తో కంపెనీ బాధ్యతలు నాకు ఇవ్వమని చెప్తానని అంటాడు. అప్పుడే రాజ్, కళ్యాణ్ ఇంటికి వస్తారు.రాజ్ దగ్గరికి రాహుల్ వచ్చి కంపెనీ గురించి మాట్లాడాలి.. కొన్ని రోజులు ఆఫీస్ ను నేను చూసుకుంటానని రాహుల్ అంటాడు. వద్దు నీకు ఆ సామర్థ్యం లేదని అంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి నా కొడుకు కి ఆఫీస్ బాధ్యతలు చూసుకునేంత సామర్ధ్యం ఉందని రుద్రాణి అంటుంటే వాడు కంపెనీ బాధ్యతలు చూసుకోవడానికి పనికి రాడాని రాజ్ చెప్తాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి ఎప్పుడెలా మాట్లాడాలో తెలియదని రుద్రాణిపై కోప్పడుతుంది.
ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. తను నిద్రపోతుంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో రాజ్ మాట్లాడుతాడు. అప్పుడే కావ్య లేస్తుంది. ఏంటి మీ బిడ్డని సరిగ్గా చూసుకుంటున్నానో లేదో తెలుసుకుంటున్నారా అని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి తెలియకుండా మీరు అబార్షన్ చెయ్యండి. తను ఒప్పుకోదని డాక్టర్ ని రాజ్ రిక్వెస్ట్ చేస్తుంటే కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |